మాంస ప్రసాదం  సాత్విక ,రాజస ,తామస ,దేవతల్లో విభాగాన్ని బట్టి మూడు రకాలుగా నైవేద్దయ్యలుoటాయి .సాత్వికమైన నైవేద్దయ్యన్ని పెడుతారు .క్రూర ,రౌద్ర దేవతలకు ,క్షుద్ర దేవతలకు రాజస తామసమైన ఆహారాన్ని నైవేద్దయ్యంగా ఉంచుతారు .సాత్విక దేవతల ఆహారానికి నైవేద్దయ్యం అని పేరు .రాజస మరియు తామస దేవతల ఆహారానికి బలి అని పేరు

     దీనిలో క్రూర ప్రాణులను సాత్విక ప్రాణులను బలి ఇచ్చి దేవునికి సమర్పించిన పదార్దాలను ప్రసాద రూపంలో స్వీకరించి మాంసం తదితరాలను తింటారు .ఈ రితిగా తినే పదార్ధాలను తీసుకొంటే దేహంలో చేరినా తరువాత తిన్నవారికి అన్ని రకాల తామస గుణాలు దేహంలో ఉత్పత్తి అవుతాయి .రాజస ,తామస గుణాలతో చేసినా అర్పించిన లేదా బలి రూపంలో ఉన్న అన్ని మాంసపు ప్రసాదాలను ఎవరు గ్రహిస్తారో ఎవరైతే తింటారో వారికి  కలిగే ఫలితాలు

  1.బలి ఇచ్చిన మాంసాన్ని తినకూడదు

2. మాంసాన్ని తింటే దైహిక రోగభాధ ఉదర వ్యాధి వస్తుంది

3.బలి మాంసాన్ని తిన్న మూడు రోజులు పాటు ఇంట్లో దేవుని పూజ చేయకుడదు

4.బలి మాంసాన్ని తిన్న మూడు రోజులు ఇంట్లో గొడవలు ,సోమరితనం ,మనస్సు స్తిరంగా లేకుండా అవుతుంది

5.ఇంట్లో ఆడవారు లేదా ఆడ పిల్లలు ఋతుమతి అయినప్పుడు బలి మాంసాన్ని తింటే జీవితం పూర్తిగా నరాకాన్ని అనుభవిoచవలసి వస్తుంది

6.బలి మాంసాన్ని ఇతర ప్రాణులకు అంటే కుక్క ,కాకి తదితర ప్రాణులకూ పెట్టాలి .కాని మనుషులు తినకూడదు

7.బలి మాంసాన్ని ఇతరులకు ఇవ్వాలి కాని మొక్కుకున్నవారు  తినకూడదు

8.బలి మాంసాన్ని తమ కులదేవత మొక్కు ఉన్నవారు తినకూడదు

9.బలి మాంసాన్ని చేసినా వంటలో తిన్న తరువాత మిగిలిన బోజనాన్ని ఇంటికి లేదా మరో ఊరికి తీసుకోనివెళ్ళకూడదు

10.బలి మాంసాన్ని ఒక్కరే కూర్చిని తినకూడదు

11.బలి మాంసాన్ని కొత్త దంపతులు తినాకుడదు

12.బలి మాంసాన్ని ఎట్టి పరిస్తితుల్లో గర్బినులు తినకూడదు

13.బలి మాంసాన్ని శుభకార్యల్లు పెట్టుకోన్నవారు .ఇతరుల ఇళ్ళలో శుభకార్యాలకు వెళ్ళేవారు దేవాలయాలకు వెళ్ళేవారికీ ఎట్టి పరిస్తితుల్లో ఇవ్వకూడదు

14.బలి మాంసాన్ని 12 సంవస్తరాలలోపు వయస్సు ఉన్నవారికి ఎట్టి పరిస్టితుల్లో పెట్టకూడదు

1 5బలి ఇచ్చే సమయంలో బలి ప్రాణులను చూడకూడదు .ఎవరైనా చుస్తే అటువంటి వారికీ రోగ భాద ,మనశాంతి పోయి నరకాన్ని చూస్తారు

16.బలి ఇచ్చే సమయంలో స్నేహితులను  పిలవకుడదు .ఒకవేళ వస్తే స్నేహితులకు కష్ట్టాలు ,ఆశాంతి , చూపించిన వారికీ ,పిలుచుకువచ్చిన వారికీ వెళ్ళిన వారికీ కలుగుతుంది

17.బలి మాంసపు బోజనాన్ని ,స్నేహితులకు ,బంధువులకు భలవంతంగా పెట్టకూడదు

18 బలి మొక్కును సాధ్యమైనంత వరకు తామే తమ పరంగా ఇతరుల ద్వార చేయిoచుకోవడం చాల మంచిది

19.దేవునికి సమర్పించిన మాంసం క్షుద్ర దేవతలకు రాజస ,తామస దేవతలకూ ప్రసాదం అవుతుంది .అందుకే దీనికి మాంస ప్రసాదామని పేరు వచ్చింది
 http://manadevatalaprasadamulu.blogspot.in


.

2 comments:

 1. ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,

  మహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.

  సాయి రామ్ సేవక బృందం,
  తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
  సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
  * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*

  ReplyDelete