అక్షతా ప్రసాదం



                 అక్షతాల్లో నాలుగు రకాలు ఉన్నాయి

1.బియ్యంతో అక్షతలు

2.నల్లని నువ్వులతో అక్షతలు

3.మంత్రాక్షత

4.సువర్ణమంత్రక్షత

   బియ్యంతో అక్షతలు

   బియ్యాన్ని నెయ్యీ పసుపులను రెండిటిని కలిపి శుభ కార్యాలు లేదా మంగళ కార్యాల్లో ఉపయోగిస్తారు .ఉదాహరణకు :పెళ్లి ,ఉపనయనం ,శాంతి కార్యాల్లో  పసుపు అక్షతలను ఉపయోగిస్తారు .ఎటువంటి పరిస్తితుల్లో కుంకమ అక్షతలను ఉపయోగించకుడదు .ఒక వేళా ఉపయోగిస్తే గొడవలు జరుగుతాయి

  ప్రతి పండగలో ,వ్రతాల్లో ,సీమంతం సమయంలో కుంకుమ అక్షతలను తయారు చేసుకోవాలి .ఈ సమయాల్లో పసుపు అక్షతలు ఫలాన్ని అందించవు .కుంకుమ అక్షతలను దేవి పూజలో ఉపయోగిస్తే అన్ని దోషాలు తొలగి సౌభాగ్యం సిద్దిస్తుంది .దేవిఅనుగ్రహం త్వరగా లబిస్తుంది .ఒట్టి బియాన్ని నీటిలో నానబెట్టి అనంతరం నీటిలో నానిన బియ్యంను అక్షత లేదా యువ అక్షత అని అంటారు .ఈ యువ అక్షతలను పెద్దల కార్యాలు చేసే సమయంలో మాత్రమే ఉపయోగిస్తారు

తిలక్షత

నల్లని నువ్వులను మరియు యువ క్షతలను అశుభ కార్యల్లలో మరియు పెద్దల పితృ దేవతల కార్యాల్లో ఉపయోగిస్తారు

మంత్రాక్షిత

వీటిని మట్టలలో-శ్రీ రాఘవేంద్ర స్వామి మట్టoలో ప్రసాదంగా అందిస్తారు

  మట్టాల వారు అక్షతలను చేసుకొని ఆ అక్షతలకు ద్వాదశాక్షరి మంత్రం మరియు అష్టాక్షరి మంత్రంతో మంత్రించి ఆ అక్షత మూల రామునికి పూజ చేసిన తరువాత శ్రీ రాఘవేంద్ర స్వామికి పూజ చేసి ,వచ్చే భక్తులకు ప్రసాదరుపంలో అక్షతలను ఇస్తారు

  అక్షతలను మంత్రించటం ద్వార మంత్ర +అక్షిత -మంత్రక్షతలు అని పేరు .వీటిని తలఫై వేసుకొని మెగిలిన వాటిని డబ్బాల్లో వేసుకొని ఉంచుకొంటే ద్యానం ఎక్కువ అయి ,గురువుల అనుగ్రహం ఎప్పటికి ఉంటుంది

1.మంత్రక్షిత విద్యార్ది ,విద్యార్ధులు గురువారం ఉదయం శ్రీ రాఘవేంద్ర స్వామికి నమస్కరం చేసి మట్టం వారు ఇచ్చే మంత్రక్షతలు తెసికొని గురువుల పేరు చెప్పి కొద్దిగా నోటిలో వేసుకొని నీరు త్రాగితే జ్ఞాపక శక్తీ ఎక్కువ అవుతుంది

2.వ్యాధి ఉన్నవారికీ మంత్రక్షతలను నీటిలో వేసి గురువుల ప్రాద్ధనచేసి నీరు త్రాగితే అన్ని వ్యాధులు తొలగిపోతాయి

3.దూర ప్రయాణం చేసే సమయంలో అక్షతలను వెంట తెసుకొని వెళ్ళితే ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు

4.పండ్లతో కలిపి మంత్రాక్షతలను ఇచ్చి ఆశ్వేరదించండి.దేనితో పెళ్లి కానీ వారికీ త్వరగా వివాహం జరుగుతుంది

5.అక్షితలు లేని ఆశ్వేరావదం వ్యర్డ్డం

6.పటిక బెల్లంతో కలిపి అక్షతలను దంపతులకు ఇస్తే అన్ని కష్టాలు నివారణఅవుతాయి

               సువర్ణ మంత్రాక్షతలు


   దంపతులు  గురు దర్శనానికి  వెళ్లి పండ్లు ,పటిక బెల్లం ఉంచి నమస్కరిస్తారు .అప్పుడు గురువులు వచ్చి దంపతుల యోగ క్షేమాలు విచారించి వారికీ పండ్లు ,అక్షతులు ఇచ్చి అశ్విరాదిస్తారు .ఆ అక్షతలకు సువర్ణ మంత్రాక్షతలు అని అంటారు

1.సువర్ణ మంత్రాక్షతలను ఎట్టి స్తితిలోను పరబోయరాదు .చేతితో తీసికోరాదు .చేతితో తీసికొంటే దరిద్రం చుట్టూకొంటుంది .మగవారైతే సువర్ణ మంత్రక్షితను ఫై పంచె చివరి భాగంలో చేయిoచుకోవాలి .ఆడవారైతే చీర చెంగులో వేయిoచుకోవాలి .వస్త్రంలో వేయిoచుకొని ముడి వేసుకొని ఇంటికి వచ్చి ఆ సువర్ణ మంత్రాక్షతలను నగదు పెట్టిలో ,పెట్టి పూజించుకొంటే  దంపతులకు త్వరలో దరిద్రం తొలగిపోతుంది

2.సువర్ణ మంత్రాక్షతులను వ్యాపారం/ఇంటిలో చేసి వ్యాపారస్టలంలో ఉంచితే అధిక లాభం కలుగుతుంది

3.సువర్ణ మంత్రాక్షతలను శిష్యులు ఎన్ని రోజులైతై భద్రంగా ఉంచుకొంటారో అన్ని రోజుల పాటు వారికీ గురువుల అశ్విర్వదం ఉంటుంది

4.సువర్ణ మంత్రాక్షతులను చేతిలో ఉంచుకొని గ్రహణ కాలంలో గురువు జపం చేస్తే గురు దోషాలన్నీ తొలగిపోతాయి

5.సువర్ణ మంత్రాక్షుతలను ఉంచుకొనే ఇంటిలో గురుదోషాలు ఎప్పటికి సంభావించవు

6.సువర్ణ మంత్రాక్షితలను ఉంచే ప్రదేశంలో గురువుల చిత్రాన్ని ఉంచి గురువుల సప్తాహ పారాయణం చేస్తే మూడు తరాల గురుదోషాలు సంభావించావు

7.ప్రతి రోజు దేవతాఅర్చన చేసివారు సువర్ణ మంత్రాక్షతలకు పూజా చేస్తే సాక్షాత్ లక్ష్మి పూజ చేసినంత ఫలితం లబిస్తుంది

8.సువర్ణమంత్రాక్షతలను యంత్రంలో ఉంచి ధారణ చేస్తే అన్ని కార్యాలు సిద్దిస్తాయి


No comments:

Post a Comment