రక్షా ప్రసాదం



                  రక్షా ప్రసాదములు మూడు రకాలుగా ఉంటాయి

               1.హోమ రక్షా

               2.నవగ్రహ పిదకు రక్షా

               3.దీప రక్షా

హోమం రక్షా

ఇంటిలో,మటంలో దేవాలయంలోని హోమాలు ,ఉదాహరణకు గణపతి హోమం ,శ్రీ సుబ్రమణ్యస్వామి హోమం తదితరాలను . ఈ హోమం తరువాత ఇచ్చే రక్షకు, రక్షా ప్రసాదం  అని పేరు .ఈ హోమపు రక్షను ఎవరు కావాలన్నా ఉంచుకోవచ్చు

రక్షా ఫలం

 హోమం రక్షా ఎవరికీ ఎటువంటి ఫలితాన్ని అందిస్తుంది

1.ఎవరు హోమం చేయిస్తారో ,వారికీ ఫలం లబిస్తుంది

2.గంగా స్నానదులు చేసిన వారికీ ఫలితం ఉంటుంది

3.తల్లితండ్రుల సేవలు చేసే వారికీ ఫలితం ఉంటుంది

4.గురువులకు ,పెద్దలకు గౌరవం ఇచ్చే వారికీ ఫలితం ఉంటుంది

5.దేవుడిని నమ్మి పనులు చేసివారికీ ఫలితం ఉంటుంది

6.వ్రతం ,ఉపవాసాలు చేసివారికీ ఫలితం ఉంటుంది

7.ఎటువంటి చేడు అలవాట్లు లేని వారికీ ఫలితం ఉంటుంది

8.హోమం పూర్ణాహుతి పూర్తయి వరకు ఉపవాసం ఉండేవారికీ ఫలితం ఉంటుంది

9.గోసేవ చేసే వారికీ ఫలితం ఉంటుంది

10.హోమాన్ని శాస్త్రబద్దంగా చేసే వారికీ ,చేయిoచిన వారికీ ఫలితం ఉంటుంది

ఎవరికీ హోమం ఫలితాన్ని ఇవ్వదు

 1.ఉపవాసం  లేదా భోజనం చేసిన వారికీ ఫలితం లబించదు

2.కాళ్ళు ,చేతులు కడగకుండ రక్షాధారణ చేస్తే ఫలితం ఉండును

3.నిద్రపోయి  వచ్చి రక్షా ప్రసాదం గ్రహిస్తే వారికీ ఫలితం ఉంటుంది

4.దేవునిఫై ,గురువుల ఫై నమ్మకం లేని వారికీ ఫలితం లభించదు

5.రజస్వల అయిన స్త్రీలకూ ఫలితం లబించదు

6.నిలబడి హోమ రక్షా కట్టించుకున్న వారికీ ఫలితం ఉండదు

ఎటువంటి హోమ రక్షా ధరించకుడదు

1.భార్య హినుడు చేసిన హోమపు రక్షా ధరించాకుడదు

2.సంతానం లేని ఆచరుయ్యుడు చేసిన హోమం రక్షా ధరించాకుడదు

3.బ్రహ్మచారులు చేరి చేయిoచిన రక్షా ధరించకుడదు

4.శ్రీ మహా మృత్తుoజయ హోమం చేసిన రక్షా ధరించాకుడదు

5.అఘోర హోమం రక్షా ధరించకుడదు

6.శ్రీ నవగ్రహ దేవతల గురించి చేసిన శాంతి హోమం రక్షా ధరించకుడదు

7.మైలతో ఉన్నప్పుడు చేసిన హోమం రక్షా ధరించాకుడదు

8.క్రూర హోమం రక్షా ధరించ కూడదు

9.పితృ హోమం రక్షా ధరించకుడదు

10.సర్ప సంస్కర హోమం రక్షా ధరించకుడదు

11.రాక్షో గ్న  హోమం రక్షా ధరించకుడదు

12.బ్రాహ్మణులూ కాకుండా ఇతరులు చేసిన హోమం రక్షా ధరించాకుడదు

13.కదళి వివాహ హోమం రక్షా ధరించకుడదు

14.స్త్రీలు చేసిన హోమం రక్షా దరించకూడదు

15.మాంగల్య శాంతి హోమం రక్షా దరించకూడదు

16.కూజదోష నివారణ హోమం రక్షా స్వికరించకుడదు

హోమం  రక్షను ఎలా స్వికరించలి

హోమo రక్షను క్రతువు రెండు సార్లు ఆచమనం చేసి తరువాత ధరించాలి

హోమం రక్షను శాస్త్రోక్తంగా స్వీకరించాలి

స్వీకరించేవారు మగవారైతే అచమ్యం చేసి స్వీకరించాలి

రక్షా స్వీకరించేవారు  పూర్ణహుతి సమయంలో యగ్నేస్వరునికి ఫల తాoభులం ఇచ్చి అనంతరం రక్షను స్వీకరించాలి

హోమం క్రతువులు తుర్ఫు వైపుకు ముఖం పెట్టి కుర్చుని రక్షా స్వీకరించాలి .రక్ష స్వీకరించిన తరువాత యగ్నేశ్వరునికి ప్రవర చెప్పి నమస్కరించు కోవాలి

హోమానికి వచ్చిన వారందరు రక్షను స్వీకరించి అనంతరం హోమగుండానికి 3సార్లు ప్రదక్షిణ చేసి అనంతరం ప్రసాదాన్ని స్వీకరించాలి

ఎ  హోమంతో ఎటువంటి ఫలితం వస్తుంది

శ్రీ గణపతి హోమంతో అన్ని పనులలో జయం సిదిస్తుంది

శ్రీ  సుబ్రమణ్య హోమంతో విద్యాప్రాప్తి ,శత్రునాశనం ,సుఖం ,శాంతి లబిస్తాయి

శ్రీ నవగ్రహ హోమంతో అన్ని కస్థలు తొలగిపోతాయి

శ్రీ సుదర్శన హోమంతో శత్రువులు అందరు అణగి ఉంటారు

శ్రీ గాయత్రి హోమంతో అన్ని శాపాలు తొలగిపోతాయి ,దుష్టుల నాశనం జరుగుతుంది

శ్రీ లలిత హోమంతో ఇంట్లో ప్రశాంతత కలుగుతుంది

హోమంలో ఎక్కడెక్కడ ధారణ చేయాలి

1.రెండు కళ్ళ రెప్పలఫైన

2.నుదిటి ఫైన

3.రెండు భుజాల ఎడమ ,కుడివైపున

4.హృదయం ఫైన

5.కంట్ట ప్రదేశం ఫైన

6.ఉదరం ,నాభి ఫైన

7.కంట్ట నేనుక

8.శిరస్సు ఫైన

9.నడుంఫైన

  మొత్తం 12 చోట్ల ద్వాదశ నామాలను చెప్పుకొని ధరించేవారు శ్రీ మన్ననారాయణలవుతారు

          ఇలా శాస్త్రోక్తంగా రక్షా ధారణ చేసే వారిలో అన్ని రకాల నదులు ,తీర్ధాలు ,దేవతలు కొలువై ఉంటారు .ఇటువంటి వారి దర్శనంతో అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెప్పుతుంది

   నవగ్రహాల పీడకు రక్ష

నవగ్రహ దేవాలయాల్లో భక్తులు తమ కష్టాల పరిహారం కోసం దేవునికి ఇష్ట్టంఅయ్యే విధంగా నువ్వుల నూనే దీపాలను వెలిగిస్తే మరికొంత మంది నూనే దీపాలను వెలిగిస్తారు

   1.నువ్వుల దీపాన్ని నూవ్వులను దేవునికి వేర్వేరు కోరికలను కోరుకొని వెలిగిస్తారు

  2.ఈ దీపాలను వెలిగించిన తరువాత దానిలో వచ్చే కాటుకుని ప్రసాదంలో కళ్ళకు ,నుదిటికి ,కంట్టనికి ,శిరస్సుకు ధరిస్తారు

స్వామికి  పూజ చేసి లేదా చేయిoఛి కాటుక ప్రసాదాన్ని వదలి మిగిలినదాన్ని మొత్తాన్ని ఉపయోగిస్తే స్వామి అనుగ్రహం కలుగుతుంది .ఎప్పుడు దేవుని కృప ఉంటుంది

             దీప రక్ష

1.మంగళ హారతి రక్ష

2.మంగళగౌరి  దీపం రక్ష

దేవుని మంగళ హారతి దీపాలను అందరు స్వికరించవచ్చు

శ్రీ మంగళగౌరీ దేవి వ్రతం కధను చదివే సమయంలో 16 దీపాలను వెలిగించి కాటుకును తెసుకొని దాన్ని రక్షగా ఉపయోగిస్తారు

ఈ దీపం రక్ష ప్రయోజనాలు

వివాహం కాకుండా ఉంటి త్వరగా వివాహం అవుతుంది

వివాహం అయిన వారికీ మంచి సంతానం కలుగుతుంది

అన్ని రోగాలు తొలగిపోతాయి

దేవి అనుగ్రహం ఎప్పటికి ఉంటుంది

భర్తకు ఆయషు వృద్ది చెందుతుంది

పూజ చేసి వారికీ సౌభాగ్యం పెరుగుతుంది

ఇంట్లో మంగళ కార్యాలు ప్రతి రోజు ఎక్కువ అవుతాయి


No comments:

Post a Comment