మిట్టికా ప్రసాద్




పంచ ద్వారక యాత్రకు వెళ్ళితే గుజరాత్ రాస్త్రంలో ఉన్న నందగుగావ్  అనే ఊరు ఉంటుంది .ఈ క్షేత్రం శ్రీ కృష్ణుడు తన బాల్య్యంలో తిరుగాడిన ప్రదేశం .ఈ ఊరిలో నందగోకుల అనే గోపాలక రాజు పాలించటంతో ఈ ప్రదేశానికి నందగావ్ అని  పేరు .ఈ వూరిలో శ్రీ శ్రీకృష్ణ పరమాత్త్మడి బాల విగ్రహనిని నందలాల్ అని పిలుస్తారు .ఈ ఊరిలో విశేషం ఏమిటి అంటే మనం పూలు పండ్లు ,స్వీట్స్ను బాల కృష్ణునికి తెసుకొనే వెళ్ళితే దేవాలయం వారు వాటిని దేవునికి ప్రసాదంగా ఉంచి అనంతరం దానితో పాటు మిట్టికా ప్రసాద్ అంటే చిన్న నిమ్మకాయ సైజులో ఉంటె మట్టి ఉండను ప్రసాదంగా ఇస్తారు .కారణం అడిగితే శ్రీ కృష్ణ ఈ క్షేత్రంలో ఆటడిన ప్రదేశం కావటంతో ఈ క్షేత్రంలో మన్ను చాల పవిత్రమైనది చెప్పుతారు .పరమ పవిత్రమైన మహాత్ముడు తిరుగాడిన ఈ క్షేత్రం మన్ను తీసుకొనేవెళ్లి పూజిస్తే మంచి జరుగుతుందని చెప్పుతారు

   మిట్టికా ప్రసాద్ ఉపయోగాలు

 ఎవరికైతే సంతాన భాగ్య్యం ఉండదో అటువంటి వారు మిట్టికా ప్రసాదాన్ని శ్రీ కృష్ణని వద్ద ఉంచి పూజిస్తూ వుంటే అనంతరం సంతాన భాగ్గ్యం కలుగుతుంది

2.ఎవరైతే హరివంశ ,భాగవతం ,నారాయణియం భక్తితో చదువుతారో లేదా చదివించి మిట్టికా ప్రసాదాన్ని ధారణ చేస్తారో వారికీ సంతాన భాగ్యం కలుగుతుంది

3.ఎవరింట్లో  అయెతే పిల్లల తల్లిదండ్రులు మాటను వినరో అటువంటి వారు మిట్టికా ప్రసాదాన్ని పిల్లల పరుపు లేదా దిండు కింద ఉంచితే పిల్లలు నిద్రలో అరవటం ,భయపడటం ,పెద్దలఫై కోపం ప్రదసించటం ,తిట్టటం తగ్గిపోతుంది

4.ఎవరైతే గర్భాలు నిలవకుండా ఉంటాయో ,గర్భం జారిపోతూoటుందో కాన్పులోనే పిల్లలు పుట్టి మృతిచెందుతుంటారో  అటువంటి  వారు గర్భసుఖ్త్తాన్ని పటించి ఈ ప్రసాదాన్ని గర్భం చుట్టూ పుసుకొంటే గర్భం నిలుస్తుంది .ఒకవేళ మిట్టికా ప్రసాదం లేకపోతే గర్భ సుక్తాన్ని నీటితో అభిమంత్రించి ప్రతీరోజు పుసుకొంటే గర్భం నిలుస్తుంది .మగ పిల్లవాడు జన్మిస్తాడు

5.ఎవరైతే ఆడ పిల్లలు ఉండి మగ సంతానాన్ని కోరుకొంటారో అటువంటి వారు శ్రీ సంతాన గొపాలస్వామి మూల మంత్రాన్ని జపించి ,వెన్నను దేవునికి ప్రసాదంగా పెట్టి ఆ ప్రసాదాన్ని స్వికరిస్తే మగ సంతానం కలుగుతుంది

6.ఎవరైతే తమకు మగ పిల్లలే పుట్టాలని ఆడ పిల్లలు వద్దని కోరుకొంటారో అటువంటి వారు షష్టి మాత దేవుని పుజించితే అటువంటి వారికీ మగపిల్లవాడు జన్మిస్తాడు

7.మగ పిల్లలు వద్దని ఆడ పిల్లలే కావాలని కోరుకొనేవారు దుర్గాదేవిని పుజించేతే ఆడ పిల్లలే పుడతారు

8.చిన్న పిల్లలు రాత్రి పూట ఉలిక్కిపడి లేఛి కూర్చుంటే మిట్టికా ప్రసాదాన్ని ఉయాలలో ఉంచితే పిల్లవాడు ఆరోగ్యవంతుడుగా అవుతారు

9.చిన్న పిల్లలకు ఆరోగ్యం పదే పదే పడవుతుంటే మిట్టికా ప్రసాదాన్ని ఉపయోగించి పిల్ల వానికి దిష్టి తెస్తే పిల్లవాడు ఎప్పటికి ఆరోగ్యవంతుడు గా ఉంటారు

10.ఎంతకు నడకరాని పిల్లలకు నూనెలో మిట్టికా ప్రసాదాన్ని వేసి కాలికి మర్దనం చేస్తుంటే పిల్లవాడు చక్కగా ఆడుకొంటూ ఆరోగ్యంగా ఉంటాడు

No comments:

Post a Comment