నేత్ర ప్రసాదం
            నేత్ర ప్రసాదం అంటె కన్నుల ప్రసాదం .దేవాలయానికి భక్తులు తీసుకోని వెళ్ళే పూలు ,పండ్లుతో పాటు కొన్ని చోట్ల కన్నులను కుడా తీసుకోని వెళ్ళవలసి ఉంటుంది .అదే కన్నులను అమ్ముతారా .పరమేశ్వరుని భార్య అయిన ద్రాక్షయణి తన తండ్రి చేసిన యాగంలో తనకు తన భర్తకు అయిన అవమానాన్ని తాళ్ళలేక యాగం చేస్తున్న యజ్ఞ కుండలో దూకి ఆత్మహత్య చేసుకొంటుంది .ఈ స్టలాన్ని మనం హరిద్వారలోని సతీకుండం దగ్గర చూడవచ్చు

   ఈ విషయాన్నీ విని పరమేశ్వరుడు తన భార్య ద్రాక్షాయణి దేవి నిర్జీవ శరీరాన్ని భుజానికి ఎత్తుకొని భూప్రదక్షణ  చేస్తున్న సమయంలో విష్ణువు చూసి  తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని తన యోగ మాయచే 64 భాగాలుగా చేస్తాడు .కొందరు 108 అని అంటారు

   దేవి ఒక్కోభాగం ఒక్కో ప్రదేశంలో పడతాయి .వాటికీ శక్తీ పీటలని ప్రతీతి .సతీ దేవి నయనాలు అంటే కళ్ళు పడిన ప్రదేశమే హిమాచల ప్రదేశంలోని నయనదేవి  మందిరం .ఈ నయన దేవికి పండ్లు ,పూలతో పాటు కన్నులను తీసుకోని వెళ్ళితే వాటిని దేవికి తాకించి ,భక్తులకు కన్నులను ప్రసాదంగా ఇస్తారు .ఈ క్షేత్రంలోని దుకాణాలలో ఇత్తడి ,వెండి ,బoగారు కన్నులను విక్రయిస్తారు

    దేవాలయాల్లో దేవికి నేత్రాలను సమర్పించి ప్రసాద రూపంగా  ఇస్తూoడటంతో  ఈ నేత్రాలకు నేత్ర ప్రసాదమని పేరు

  ఈ ప్రసాదాలైన  నేత్రాలను ఏమి చేయాలి
             
1.ఈ నేత్రాలను ఇంటికి తీసుకువచ్చి శుద్దిగా నేత్రాలను వెండి పళ్ళెంలో ఉంచి పంచామృత అభిషేకాన్ని చేసి ,శుద్దగంగ లేదా పరిశుద్దమైన నీటితో చాక్షుషి ఉపనిషత్తో అభిషేకాన్ని పూర్తిచేసి తరువాత వస్త్రంతో తుడిచి నేత్ర పూజ విధానంతో పూజించాలి .నేత్రాలను కడిగిన నీటితో ఎవరికీ కంటి రోగాలు ఉంటాయో ,ఎవరి కళ్ళు ఎప్పుడు ఎర్రగా అవుతుంటయో అటువంటి వారు .ఈ నీటితో కళ్ళను తుడుచుకొంటే (కంటి రెప్పల  ఫైన మాత్రమే )అన్ని రకాల కంటి రోగాలు నయం అవుతాయి

2.దూర దృష్టి ,హస్వ దృష్టి దోషాలు ఉన్నవారు  ప్రసాదంగా వచ్చిన నేత్రాలకు  చేసిన అబిషేకపు నీటిని  కంటిలో వేసుకొంటి ఈ దోషాలు తొలగి కళ్ళు శుబ్రంగా కనిపిస్తాయి .ఇదే రీతిగా కనీసం ఒక వారం చేస్తే మీ కంట్లో ఉన్న అన్ని రకాల దోషాలు నివారణ అవుతాయి

3.కంట్లో  పొర కనపడినప్పుడు నేత్ర ప్రసాదపు కళ్ళను తేనేతో  కడిగి ఆ తేనే ప్రసాదాన్ని ప్రతి రోజు ఆ కళ్ళకు 4-5 చుక్కల తేనేను వేసుకొంటు వస్తే కంటిలోని అన్ని దోషాలు తొలగిపోతాయి .ఆరోగ్యంగా ఉంటారు

4.ఎవరికైతే 40 సంవస్త్సరాలు నుంచి 50 సంవస్త్సరాల మధ్యలో కళ్ళలో పొర వచ్చి దోషాలు ఏర్పడితే అటువంటి వారు నేత్ర ప్రసాదాన్ని ప్రతి రోజు నీళ్ళలో నానబెట్టి  ఉంచాలి .ఉదయం నేత్ర ప్రసాదపు నీటితో రెండు కళ్ళను ఐకప్స్
తో  15 రోజుల  నుంచి  నెల పాటు మర్దన చేసికొంటూ వస్తే  కళ్ళలోని పొర తొలగిపోతుంది

5.కళ్ళ దోషాల కారణంగా తల నొప్పి వస్తుందో అటువంటి వారు నేత్ర ప్రసాదపు కళ్ళను కొబ్బరి నూనేలో  నానభేట్టాలి .తరువాత  రోజు  నేత్ర  ప్రసాదాలను తీసి మిగిలిన నూనెను ఒక సీసాకు వేసుకోండి .ప్రతి రోజు  ఈ నూనేను తల  దువ్వు కొనే సమయంలో ప్రసాదపు నూనేను తలకు పూసుకొని తల దువ్వుకొంటే దీని వలన మీకు తల నొప్పి రాదు

6.ఎవరికైనా అధిక రక్త పోటు లేదా  అధిక మధుమేహా వ్యాధి ఉంటుందో  అటువంటి వారు నేత్ర ప్రసాదపు కళ్ళకు ఇంద్రాక్షి సోత్రంను పటిస్తూ నీటిలో లేదా నూనెలో  అభిషేకం చేసి అనంతరం ఆ నీరు లేదా నూనేను ప్రతి రోజు తల మాడుఫై మద్దించుకొంటె అన్ని రకాల  శిరోవ్యాధులు .అన్ని రకాల నేత్ర వ్యాధులు నివారణ అవుతాయి


No comments:

Post a comment