మాదక ప్రసాదం                   మీరు దేవాలయాలకు వెళ్ళితే మీకు ఒక్కో దేవాలయంలో ఒక్కో తరహ ప్రసాదాలను ఇస్తారు .భారత్ దేశంలోని ముఖ్యమైన ప్రముఖ శివుని దేవాలయంల్లో ఒక్కటైన జ్యోతిర్లింగాలలో మూడవ స్తానాన్ని పొందిన ఉజ్జయనిలో ఉన్న మహాకాలుని సమీపంలోని శ్రీ భైరవేశ్వర దేవాలయానికి ఒక్క సారి వెళ్ళండి

   ఇక్కడి సంప్రదాయం మేరకు భక్తులు శ్రీ భైరవి దేవునికి కూడా సామగ్రితో పాటుగా మాదక పానీయాన్ని (మత్తు పదార్దం )తీసుకోని వెళ్ళవలసి ఉంటుంది .పూజ సామగ్రిని విక్రయిoచే దుకాణాల్లో  మాదక పానియపు సీసాలను ఇస్తారు

    ఈ పూజ సామగ్రులతో పాటు మాదక పానీయం ఉన్న సీసాలను దేవాలయం లోపలికి భక్తులు తెసుకొని వెళ్ళితే ,వాటితో అక్కడి అర్చకులు శ్రీ భైరవ దేవుడిని పూజించి అనంతరం మాదక పానీయాన్ని దేవునికి తాగిస్తారు

   మన రాష్ట్రంలోని విజయవాడ వద్ద ఉన్న మంగళగిరి పట్టణంలోని కొండాఫై శ్రీ నరసింహస్వామి దేవాలయంలో దేవునికి భక్తులు తెసుకువచ్చే పూజ వస్తువులతో పాటు పానకాన్ని కూడా తీసుకోని వస్తారు .పానకాన్ని దేవునికి పెట్టి పానకాన్ని శంఖం ద్వార దేవునికి త్రాగిస్తారు

   స్వామి త్రాగిన తరువాత మిగిలిన పానకాన్ని భక్తులకు పంచుతారు .అందుకనే ఆ దేవునికి పానకాల నరసింహస్వామి అని పేరు

  అదే తరహాలో శ్రీ భైరవనాధ దేవునికి భక్తులు తీసుకోని వెళ్ళే పూజ సామగ్రులతో దేవుడిని పూజించి అనంతరం మాదక పానీయాన్ని ఒక పాత్రలో వేసి దాన్ని స్వామికి త్రాగిస్తారు .స్వామి త్రాగిన తరువాత మిగిలిన పానీయాన్ని ప్రసాద రూపంలో తీసుకువచ్చి భక్తులకు పండ్లు పూలు ఇచినట్ట్లే  దీనిని కూడా ప్రసాద రూపంలో అందిస్తారు


No comments:

Post a Comment