తిలకాలు లేదా తిలక ప్రసాదం



                 తిలకాలు మరియు తిలక ప్రసాదాల్లో గాని చాలా రకాలు ఉన్నాయి .వాటిలో కొన్నిటిని కింద పేర్కొన్నాము .

     

                                              పసుపు

                   దీనికి సంస్కురుతంలో  హరిద్ర అని పేరు .పసుపును అన్ని శుభకార్యాలలో ఉపయోగిస్తారు .శాస్త్రాలలో పేర్కన్న ప్రకారం ఈ కింది వస్తువులను ఎవరి నుంచి అయేనా పొందవచ్చు .వాటికి మైల ఉండదు  అదేమిటoటే

              1.పసుపు 2.కుంకుమ 3.పూలు 4.పళ్ళు 5.తమలపాకు 6.వక్క 7.పాలు 8.పేరుగు 9.నేయీ

 10.తేనే 11.కూరగాయలు 12. తులసి  13.గంధం అరగదేసే సానరాయి  14.గంధం చేక్క

              వీటిలో పసుపును మొదటి స్థనం కల్పించబడింది .అలానే సుమంగళులకు తాంబూలం లేదా ఆకు ,వక్క ఇచ్చే సమయములో మొదలు పసుపును ఇచ్చి తరువాత  కుంకుమ ఇస్తారు

 పసుపు సౌభాగ్యనికి చిహ్నం .అందుకే పసుపును ముందుగా ఇస్తారు .ఈ కారణం చేతనే సుమంగళులు తన భర్తకు శుభం కోరుతూ మంగల్ల్యానికి  పసుపు  ఉంచి నమస్కరిస్తారు

   దేవీ ఆలయాలలో నవరాత్రి పూజా సమయములో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి .గోదా దేవీ లేదా అoడాళ్ అమ్మవారి దేవాలయములోనికి మీరు  వెళ్లినప్పుడు మీకు పసుపు ప్రసాదాన్ని అందిస్తే మీరు ఎం చేస్తారు .పసుపును ఇంటికి తీసుకువచ్చి వంటల్లో లేదా స్స్థానం చేసేoదుకు ఉపయోగిస్తారు .ఆయితే  ఇకఫై  అల చేయద్దు .

              పసుపును ప్రసాదంగా పోంది ఇంటికి తీసుకువచ్చినప్పుడు  చేయవల్సిన విధాన క్రమం

  1.దేవుని ప్రసాదమైన పసుపును ప్రతి దినం పూజాగదిలో ఉంచి పూజిస్తే ఇంటికి ,ఇంట్లో ఉన్నవారికి అన్ని విధాల ధన ,కనక ,వస్తు ,వాహనాలు వృద్ది చేoదుతాయి .

2. పసుపులో నీటిలో వేసి స్టానం చేస్తే దేహ కాంతి పేరుగుతుంది .సమస్త చర్మ రోగాలు నయం అవుతాయి .పసుపును నీటిలో వేసి చేసే స్టానం మంగళ స్టానం అని పిలుస్తారు .

3.పసుపుతో గౌరీ దేవీని చేసి పూజించటం ద్వార ఇంట్లో వుండే వధువుకు ఉన్న వివాహ దోషాలు తొలగిపోతాయి త్వరలో వివాహం నిశ్చయం అవుతుంది

4.దేవికి పసుపు రంగు చీరను ఇస్తే ఇంట్లో ఉండే దోషం మరియు దైవ దోషాలు తొలగిపోతయి .

5.దుకాణల్లో చాల రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలివుండే వస్తువులఫై కొద్దిగా పసుపు పొడిని చల్లితే వెంటనే వ్యాపారం అవుతుంది.

6.పసుపు నీటితో ఇంటిని కడిగితే అ ఇంటికి ,ఆ ఇంటి వారికీ డబ్బు సమస్య రాదు .అప్పుల బాధ తొలగిపోతుంది

7.కామెర్లు ఉన్నవారి ఇంటి వారు పసుపును దానంగా ఇస్తే కామేర్ర్ల రోగం తొలిగిపోతుంది

8.ప్రతి సంవస్త్సరం కామేర్ర్ల్లు వచ్చేవారు సుమంగుళకు పసుపు రంగు చీర తాంబూలాలను దానంగా ఇస్తే కామెర్ల సమస్య తలేత్తదు .

9.గృహ దేవతను పసుపు నీటితో కడిగితే విగ్రహాలకు దైవకళ  పేరుగుతుంది .

10.వ్యాపారం జరగని దుకాణాల్లో శంఖాన్ని పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని గల్లా పెట్టిలో ఉంచితే వ్యాపారం వృద్ది అవుతుంది

                             కుంకుమ


    కుంకుమను  సుమంగళిలకు ,దేవతలకు ,దేవికి చాల ఇష్టం .కుంకుమలకు దృష్టి పరిహారం చేసే శక్తీ ఉంది .

 1.కుంకుమతో చేసే అర్చనతో అన్ని రకాల దేవతలు ,దేవిలు తృప్తి చేoదుతారు .

2. సుమంగళిలు ఇచ్చే కుంకుమతో ఇంటిలో ఉండే వివిధ దోషాలు తొలగిపోతాయి . దేవి అనుగ్రహం కూడా ఉంటుంది .

3.కుంకుమ దానంతో ఇంటిలో ఉండే సమస్త దోషాలు నివారించాబడుతాయి

4.కుంకుమను గుమ్మడి కాయలో ఉంచి దిష్టి తీసి కొడితే అన్ని రకాల దిష్టి దోషాలు  దురమవుతాయి .

5.ఎవరికితే కుంకుమను ప్రతి రోజు నుదుట ధరిస్తారో వారికీ దేవతలందరి ఆశీర్వాదం ఉంటుంది

6.కుంకుమను నీటితో దిష్టి తీసి విధిలో పరపోస్తే అన్ని రకాల  దృష్టి దోషాలు తొలగిపోతాయి .

7.అన్నంలో కుంకుమను కలిపి దిష్టి తీసి మూడు రోడ్డ్లు కలిపే స్తలంలో ఉంచితే త్వరగా అన్నం దిష్టి దోషాలు తొలగిపోతాయి

     

             చంద్ర (కుంకుమ పువ్వు  రంగు కుంకుమ )


    ఈ కుంకుమ శ్రీమహాలక్ష్మి దేవికీ ,ఆంజనేయ స్వామికి  చాల ఇష్టం

1.చంద్రతో  శ్రీ మహాలక్ష్మికి అర్చన చేస్తు వస్తే ఇంట్లో డబ్బుకు ఎప్పుడు  ఎటువంటి సమస్య ఉండదు

2.చంద్రతో దేవుడిని పూజిస్తే దేవునికి కళ వస్తుంది .తేజస్సు వస్తుంది

3.చంద్రతో  మంగళగౌరికి పూజ చేస్తే మన మనస్సును ఇష్టామైన అబ్బాయి లేదా అమ్మాయి పరిచయం అయీ త్వరలో వివాహం అవుతుంది

4. చంద్రతో శ్రీ రాధాకృష్ణ దేవునికి అష్టోత్తరం చేస్తే ఇంటిలో మంగళ కార్యాలు ఎటువంటి సమస్యలు లేకుండా జరిగిపోతాయి .

5..చంద్ర కలిపిన  అన్నం  పార్వతిపరమేశ్వరులకు నైవేద్యం పెట్టి ప్రసాదాన్ని తెంటే అన్ని వ్యాధులు తొలగిపోతాయి

                                 సింధూరం

సింధురాన్ని హనుమదేవునికి  పూస్తారు

1.ఎవరింట్లో అయెతే నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటి వారు ప్రతిరోజు సింధూర ధారణ చేపడితే అన్ని రకాల దాంపత్య సమస్య్యలు తొలగిపోతాయి

2.ఎవరింట్లో అయెతే భీతి ,భయం ,వెంతడుతున్తాయో అటువంటి వారు సింధురాన్ని పెట్టుకొంటే భయం తొలగిపోతాయి

3.ఎవరి ఇంట్లో అయెతే భార్య ,భర్తలు,పిల్లల మధ్య సఖ్యత ఉండదో అటువంటి వారు సింధురాన్ని పెట్టుకొంటే సుఖం,సంతోషం ,ప్రశాంతత  లబిస్తుంది

4.చిన్న పిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటె ఆ పిల్లలకు సింధురాన్ని పెడితే ,భయం ,భీతీ ,రోగ భాధలు ,ఏమి దరిచేరవు .ఆరోగ్య్యావంతులుగా ఉంటారు .

5.వివాహమైన కొత్త దంపతులు ఆంజనేయ స్వామి సింధురాన్ని పెట్టుకొంటే వారికీ పిల్లలు కలగరు .

6.విద్యార్ధులు ,విద్యార్దునులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి సింధురాన్ని పెట్టుకుంటే  పరీక్షా సమయంలో  చదివిన

విషయాలన్నిటిని మర్చి పోకుండా ఉంటారు

7.లో బిపీ ఉన్నవారు  రక్త హీనత సమస్యలతో  భాదపడేవారు .ఆంజనేయ స్వామి తీర్థాన్ని సేవించి సింధురాన్ని నుదుటికి పెట్టుకొంటే  ఆరోగ్యభాగ్యం సిద్దిస్తుంది

8.గ్రహ బాధలు ఉన్నవారు ప్రతి రోజు సిందురాన్ని పెట్టుకొంటే గ్రహాల భాధ తొలగిపోతుంది

9.ఇంట్లో ఆంజనేయ స్వామికి గంధాన్ని పుయదలచినవారు  దేవుని  చిత్రాన్ని దక్షిణవైపు ఉంచి  కొద్దిగా గంధాన్ని స్వామి కిరిటానికి పెట్టాలి .తరువాత అంతా  గంధం పుసుకుంటూ వచ్చి చివరగా గంధాన్ని పాదం వద్ద  పెట్టి పూజిస్తే తలచినవాన్ని నేరవేరుతాయి .

10.ఆంజనేయ స్వామికి  సింధురాన్ని పెట్టి తరువాత దానిని పాలల్లో లేదా నీటిలో కలిపి తాగుతూ వుంటే దేహం వజ్రమయం అవుతుంది

       పచ్చ కర్పూర తిలకం

  పచ్చ కర్పూర తిలకాన్ని తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి  ప్రతి రోజు పెడతారు .భక్తులూ దేవునునికి కానుకులను పంపిస్తే దేవాలయం  వారు ప్రసాదమైన పచ్చ కర్పూరాన్ని పోస్టు ద్వార పంపిస్తారు .ఈ ప్రసాదాన్ని తింటారు .మరికొందరు డబ్బాలో పెడతారు .మరికొందరు ఈ ప్రసాదాన్ని ఎం చెయలని ఆలోచిస్తూoటారు .దీనికి సమాధానం ఇక్కడ ఉంది .

                   1.స్వామి ప్రసాదమైన పచ్చ కర్పూరాన్ని పాలలో వేసుకొని తాగాలి .దాంతో స్వామి ప్రసాదాన్ని సేవించినట్లు అవుతుంది .

              2.పచ్చ కర్పూరాన్ని కొబ్బరి నూనేలో కలిపి తలకు పుసుకొంటే జుట్టు సుగంధమయం అవుతుంది .

             3.పచ్చ కర్పూరాన్ని కుకుమలో కలిపి నుదిటికి పెట్టుకొంటే  సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పటి కి ఉంటుంది .

   

            4.పచ్చ కర్పూరాన్ని నీటిలో కలిపి ముక్కు ,ఎద ,నుదిటికి రాసుకొంటే ఎటువంటే జలుబు ఆయెన వదిలి

వేళ్ళవలిసిందే.తలనొప్పి సగం పోతుంది

         5.పచ్చ కర్పూరం కుంకుం పువ్వు కలిపి డబ్బాల పెట్టాలో పెడితే ఎక్కువ ధన లాభం కలుగుతుంది .

          6.వ్యావారులు ప్రతి రోజు పచ్చ కర్పూరాన్ని కుంకుమను నుదిటికి పెట్టుకొంటె ఆ రోజు ఎక్కువ వ్యాపారం జరుగుతుంది

           7.పచ్చ కర్పూరాన్ని తీపి పదార్దాలకు కలిపి దేవునుకి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే -మీ ఇంట శుభకార్యాలు త్వరగా  జరుగుతాయి .

8.పచ్చ కర్పూరాన్ని కలిపినా నీటిని ప్రతి రోజు త్రాగితే గ్యాస్ట్రిక్ సమస్య ,దంత దుర్గంధం  దరిచేరవు .

9.పచ్చ కర్పూరం తో  హోమం చేస్తే అన్నీ వసికరణ అవుతాయి .

   10.పచ్చ కర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే మీకు రాజ సన్మాన గౌరవం ఎక్కువ అవుతుంది

11.పిల్లలు లేని వారు పాలకు పచ్చ కర్పూరాన్ని  జోడించి మంగళవారం శ్రీ సుబ్రమణ్య స్వామికి అబిషేకం చేసి ఆ పాలను త్రాగుతూ వుంటే  అన్ని రకాల  గర్భ దోషాలు నివారణ అయి సంతానం కలుగుతుంది

12.పచ్చ కర్పూరాన్ని  బ్రాహ్మణులకు  దానం చేస్తే  అన్ని పనులు త్వరగా నెరవేరి గౌరవం  పెరుగుతుంది .

                       రక్త చందనం లేదా ఎరుపు గంధం


 1.రక్త చందనం  లేదా ఎరుపు గంధం  దేవునికి  నివేదిస్తే దేవునికి కళ వస్తుంది

2.రక్త చందనపు తిలకాన్ని నుదిటికి పెట్టుకుంటే శారీరంలో ఉన్న ఉష్టాన్ని తేసివేస్తుంది

3.ఎరుపు గంధాన్ని నుదుటికి పూసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది .

4.రక్త చందనపు లేపనాన్ని నుదిటికి రాసుకుంటే తలలోని నీరు లాగేస్తుంది అని శాస్త్రంలో చేప్పబడింది

5.రక్త చందనం తిలకాన్ని భాలింతలకు పెడితే చలువ కలగదు

6.రక్త చందనం చెక్కను వేడి నీటిలో వేసి కాచి స్తానం చేస్తే ఉబ్బసం తగ్గిపోతుంది

7.ఎరుపు గంధాన్ని నీటిలో ఉంచి ఆ నీటిని ప్రతి రోజు తాగితే అన్ని రోగాలు తగ్గి పోతాయి

                                 గోపి చందనం


 1.గోపిచందనంలో ఎవరుతే పెట్టుకొని కేశవాది ద్వాదశ నామాలను జపిస్తారో  వారిని  సాక్షాత్  నారాయణ  అని పిలుస్తారు

2.గోపి చందనంలో దేవుని ప్రసాదాన్ని  ఉంచుకుంటారో వారికీ శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది

3.గోపి చందనంతో పంచ  ముద్రికలను ఎవరు ధరిస్తారో వారిని శ్రీ కృష్ణ అని  పిలుస్తారు

4.గోపి చందనంతో దేహానికి ఎటువంటి  అపాయం కలగదు .ఈ చందనంతో రక్త పోటు రాదు .మరియు ఎటువంటి  ఒత్తిడులు  దరిచేరవు

5.గోపి చందనంతో ఇంట్లో ఉంటే ఇంట్లో వారికీ గొడవలు రావు .కోపం దరి చేరదు .

                                                   అంగార

కదళి ఫలంతోను పద్మ పుష్పాలను  బాగా ఎండించి గంధాన్ని తేసి దానితోను అంగారను చేసి దేవునికి పెడతారు

1.కదళి ఫలం అంటే అరటికాయ తోలు నుంచి ,తామర దంటు నుంచి తీసిన అంగరం శ్రీ  సీతారామ దేవునికి పెడితే

జేవితాంతం అన్నదమ్ములు కలసిమెలసి ఉంటారు

2.అంగారాన్ని శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి పెడితే సంసారoలో  సుఖ సంతోషాలకు కొరత ఉండదు

3.శ్రీ మహాలక్ష్మికి అంగరాన్ని పూస్తే ఎప్పటికి దరిద్రం ధరి చేరదు

4.సాలగ్రమానికి అంగరాన్ని పూస్తే సుబిషంగా  ఉంటారు

5.శ్రీ లక్ష్మి నరసింహ దేవునికి అంగరాన్ని పెడితే ఇంటిలో ఎవరికీ చేడు జరగదు .మాంత్రికుల బాధ ఉండదు .దైవ శక్తీ ఎక్కువగా అవుతుంది

                                           తిరుమణం

    వైస్ష్ట వులకు  ఇది ప్రతేక్కం .నామాలు పెట్టుకొనేoదుకు ఉపయోగించే తెల్లని గడ్డకు తిరుమణం లేదా శ్రీ చూర్ణం అని పేరు


1.శాస్త్రోక్తంగా వైష్ణవ బ్రాహ్మణులు   తిరుమణం నుంచి ద్వాదశ నామాలను నామాలను వేసుకోవల్లన్న నియమం  ఉంది .దీనిని ఎవరు వేసుకొంటారో వారు నారాయణ  స్వరూపం  అని అంటారు

2.తిరుమణం ధారణ  దేహంలో భక్తిని శాంతిని ఇస్తుంది

3.తిరుమణం ధరించిన  వారికీ  కోపం ,రక్తపోటు ,ఒత్తిడులు ధరి చేరవు .

4.తిరుమణం ధారణ నియమానుసారంగా చేపడితే వైకుంట లోకం ప్రప్తెస్తుంది .

                                      చాదు

  నందివర్దన పూవు ,నల్లని  ఎండు కొబ్బరి పెచ్చుతో తయారుచేస్తారు .

దేవుని అలంకార సమయంలో కళ్ళకు అలంకారం చేసే  సమయంలో కళ్ళకు చాదుతో అలంకారం చేస్తారు .

   1.దేవునునికి చాదు పెడితే అశాంతి నాశనం అవుతుంది

2.దేవునుని  కళ్ళకు చాదు పెడితే కళ్ళకు మంచి మెరుపు  వస్తుంది

3.చాదు పెట్టుకొంటే దిష్టి తగలదు

4.చాదు పెట్టుకొంటే దేహంలో కొవ్వు అంశాలు తగ్గిపోతాయి

5.చాదు పెట్టుకొంటే లావుగా ఉన్నవారు సన్నగా అవుతారు




  తిలక ప్రసాదం


           దేవుని ప్రసాదాన్ని నుదుట ధరిస్తే దానిని తిలకం అని పిలుస్తారు .తిలక ధారణను శుభ,అశుభ కార్యాలు రెండింటిలోను ధరిస్తారు . వీటిలో  మూడు రకాలు ఉన్నాయి .

            1.భస్మాలు

            2 రక్షలు

            3.తిలకాలు

భస్మాలు

        భస్మాలు  ఆరు రకాలుగా ఉంటాయి .అవి ఎమంటి

             1.విబుథి

             2.శివుని దేవాలయ భస్ముం

             3.శ్రీ సుబ్రమణ్య దేవాలయ  భస్మం

             4.సుద్ద భస్మం

             5.హోమ భస్మం

             6.చితా  భస్మం .

విబుధి

            సామాన్యమైన విభూది ని నుదిటికి పెట్టుకోవడం వల్ల ఎటువంటి దైవ శక్తీ లబించదు

శివుని దేవాలయ భస్మం

 ఈ భాస్మంని ధరించడం ద్వార దేహంలో  కాంతి వస్తుంది

 దేహంలో అన్ని రకాల వ్యాధులు తొలగిపోతాయి

రక్త పోటు లేదా హైపర్ టెన్షన్ ఉన్నవారు దీనిని పెట్టుకొంటే రక్త పోటు సాధారణ స్టితికి వస్తుంది .

మనస్సుకు ప్రశాoతాత లబిన్స్తుంది .

అధిక భాగం ఒంటరితనాని ఇష్టపడతారు

ఎక్కువుగా మాట్లాడే వారు తక్కువ చేస్తారు

మనసును ఏది భాదించదు .

శ్రీ సుబ్రమణ్య దేవాలయ భస్మం

 ఈ భస్మం ధారణకు యోగ్యమైనది .

ఈ భస్మం దేహoలొ కాంతి తేజస్సు వృద్ది చేస్తుంది

నరాల బలహీనత ఉన్నవారు దీన్ని ధరిస్తే త్వరగా కోలుకొంటారు

మూర్చ వ్యాధి ఉన్నవారు సుబ్రమణ్య దేవుని ప్రసాద భస్మంనీ  18 నేలలు పెట్టుకొంటే మరల ఎప్పుడు మూర్చ దరిచేరదు

చిన్నపిల్లలకు వచ్చే బలగ్రహ దోషాలు భస్మం పెట్టుకోవడం ద్వార తొలగిపోతాయి .

ఎవరికీ అయితే నత్తి సమష్య ఉంటుందో అటువంటి వారు దేవుని పేరు చేప్పుకొని ఈ భాస్మమ్ని నుదుట పెట్టుకొని భక్తితో భస్మాన్ని పాలలో వేసుకొని త్రాగుతూ ఉంటీ నత్తి పూర్తిగా తొలగి అందరిలాగా చక్కగా మాట్లడుతారు .

                  ఎవరికి అయతే వివాహం జరిగే  వయస్సు  వచ్చినా ఎదోక కారణంతో పెళ్ళి వాయిదా పడుతూ వస్తుందో అట్టివారు శ్రీగణపతి లేదా శ్రీ సుబ్రమణ్య స్వామికి పూజ చేసి భస్మాన్ని ధరిస్తూ ఉంటే వివాహానికి అడ్డంగా ఉన్న  అన్ని విగ్గ్నలు తొలగి ,ఎటువంటి సమస్యలు తలేత్తకుండ వివాహం జరుగుతుంది .

                     ఎవరికితే మందబుద్ది కలిగిన పిల్లలు ఉంటీ అటువంటి వారికి 18 నెలల పాటు భస్మధారణ చేయిస్తే  బుద్ది సరిగ్గా  కుదుటపడుతుంది .

                    ఎవరికైతే సంతాన భాగ్య్యం ఉండదో ,లేదా పుట్టినా సంతానం చనిపోతుంటారో అటువంటి వారు విభూది ధారణ  చేసి మంగళవారం  శ్రీ సుబ్రమణ్యశ్వర సేవను చేస్తే వారికీ పిల్లలు కలుగుతారు .లేదా బుధవారం శ్రీ మహాగణపతి పూజ సోమవారం శివుని పూజ చేసి భస్మధారణ చేస్తే ఇష్ఠసిద్ది కలుగుతుంది .

                 విద్యాబ్యాస కాలంలో మరుపు ఎక్కువుగా ఉంటీ శ్రీ సుబ్రమణ్య దేవాలయ భస్మాన్ని నుదుట ధరిస్తే జ్ఞాపక శక్తీ వృద్ది చేoదుతుంది .

             జాతకం ప్రకారం దోషాలు ఉంటీ శ్రీ సుబ్రమణ్య స్వామి ని పూజించి భస్మాన్ని ధరిస్తే ,ఉత్తమ వాక్కుశుద్ది కలిగి పలికినట్లే జరుగుతుంది .

        భస్మధారణ విధానాన్ని శాస్త్రభద్డంగా ,మంత్రోక్రంగా చేసుకొంటీ దైవభలం వృద్ది చేoదుతుంది .


సుద్ధ భస్మం (తెల్లని సుద్ద )


        దేన్ని తెల్లని సుద్ద మట్టితో తయారు చేస్తారు .ఈ భస్మాన్ని ధరిస్తే విభూది చాల గట్టిగా ఉండి త్వరగా చేరిగిపోదు .దీని ద్వార గొప్ప ఫలితం ఎమి కలగదు .అయెతే దీన్ని మంత్రభద్దంగా ధరిస్తే మాత్రం మంచి ఫలితం ఉంటుంది .

         

హొమ భస్మం

 

                   ధరిస్తే అన్ని భస్మంలకన్నా ఇది విశిష్టత కలిగినది .హొమ భస్మం యొక్క మహిమను ,గొప్పదనాన్ని చూద్దాం .

               హోమభాస్మ ధారణతో మనిషిలో ఉండే అన్ని రకాల దోషాలు నివారించబడుతాయి .

హోమభాస్మ ధారణతో  దేవుని అనుగ్రహం కలిగి అన్ని పనులు నిరాటంగా జరుగుతాయి .

భస్మధారణతో అన్ని రకాల గోచర ,అగోచర ,దృశ్య ,అదృశ్య రోగాలు తొలగిపోతాయి .

శ్రిమహగణపతి హోమంలోని భస్మం ధరిస్తే అన్ని పనులు నిరాటంగా జరుగుతాయి .

శ్రీ సుబ్రమణ్య స్వామి హోమంలోని భస్మంన్ని ధరిస్తే ఇంటిలో ఉండే కలహాలు తొలగి అందరికి శాంతి లబిస్తుంది .

శ్రీ దుర్గా హొమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం జరిగి ప్రశంతత గల జీవితాన్ని సాగించవచ్చు .

శ్రీ ధన్వంతరి హొమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని రోగాలు నివారించబడి దేహం వజ్ర సమానంగా మారుతుంది .

శ్రీ నవగ్రహ హొమంలోని భస్మాన్ని ధరిస్తే ఎటువంటి గ్రహాల చేడు ప్రభావం పడదు .

శ్రీ మృతoజయ హొమంలోని భస్మంలోని భస్మంతో అన్ని రకాల అకాల మరణాలు తొలగిపోతాయి .

శ్రీ లలితా త్రిపురసుందరి ,శ్రీ రాజరాజేశ్వరి దేవి,శ్రీ గాయత్రిదేవి హొమం ,శ్రీ చక్ర హొమంలోని భస్మన్ని ధరిస్తే అన్నీ పనుల్లో విజయం సిద్దించటంతో పాటు జీవితాంతం సుఖమయ జీవితాన్ని అనుభవిస్తారు .

శ్రీ సుధర్సన హొమం భస్మధారణతో శత్రువుల నిర్మూలం జరుగుతుంది .

శ్రీ లక్ష్మి నారాయణ హొమంలోని భస్మాన్ని ధరిస్తే భార్య భర్త మధ్య స్పర్ధలు తొలగిపోతాయి .

దేవుని హొమంలో ని భస్మాన్ని రజస్వల అయీన మహిళలు ముట్టకుడదు .మైల పరచకుడదు .ఒక వేళ మైల పరిస్తే పుణ్యాహం చేయిoచాలి .

హొమ భస్మధారణతో ఎటువంటి మాంత్రికుల బాధ ,దృష్టి ,శాపం ,గ్రహ బాధలు వేదించావు .

   చితా భస్మం


        ఉజ్జయనిలోని  శ్రీ మహాకాల అనే జ్యోతిర్లింగానికి చితా భస్మంతో అబిషేకం చేస్తారు .

       చితాభస్మాన్ని కాపాలికులు ,మాంత్రికులు ,ఆఘోరిలు ,శవ సాధకులు ,ప్రేతాత్మలను పూజించేవారు ,వామచారులు ,వామ వర్గాలకు చేoదినవారు ఉపయోగిస్తారు

                  మాoత్రికుల్లో ఒక నమ్మకం ఉంది .తమ గురువుల చితాభస్మాన్ని మాత్రమే ఉపయోగిస్తారు .దేన్నీ వాడటం ద్వార తమ గురువుల ఆత్మ తమతోనే ఉంటుంది అని నమ్మకం .నిమనుసారం చితాభస్మాన్ని ధరిస్తే ప్రేతాత్మలు భస్మ ధరణ చేసిన వారి మాటను ఎప్పుడు  వింటునే ఉంటాయని మంత్ర రహస్యాలలో వివరించబడింది

అయీతే శ్రీ మహాకాల  జ్యోతిర్లింగానికి అభిషేకం చేసిన భస్మం ప్రసాదంగా మారుతుంది .ఇది ఎటువంటి హాని కలిగించాదు .ఇది క్షీత్ర మహిమ .

         


     

No comments:

Post a Comment