ఆభరణా ప్రసాదం                  అబరణ  ప్రసాదాల్లో రెండు రకాలు ఉన్నాయి             1.దేవుని అబరణాల  ధారణ

             2 అబరణాలను దేవునికి  సమర్పణ

ఎవరైనా తీర్ధయాత్రలకు వెళ్ళిన సమయంలో లేదా దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవాలయం వారు విక్రయిoచే బంగారు ,వెండి తదితర లోహాలతో స్వామి ముఖ చిత్రం లేదా వేరే రూపంలో పెందేంట్,గొలుసు ,గాజులు ఇటువంటివి లబిస్తాయి .ఇటువంటి అబరణాలను ఎలా ధరించాలి

    దైవ భక్తులు దేవతలకు తమ చేతనైనoత  సేవతో మొక్కులతో తమ మనోరధం సిద్దించాలని ,కోరిక నేరవేరిoధనో  దేవునికి ఆభరణాలను తయారు చేయిoఛి ఇస్తారు

  దేవాలయం వారు ఆభరణాలను  దేవునికి సమర్పిస్తారు .కొద్ది కాలంలోనే  ఇతర భక్తులు కూడా వేర్వేరు ఆభరణాలను దేవునికి సమర్పించుకొంటారు .అప్పుడు పాత ఆభరణాలను  కరిగించి దానిఫై దేవుని ముఖ చిత్రాన్నో ,స్వామి విగ్రహన్నో ,దాలర్ ,పెండేంట్ ,గాజులు ,ఉంగరాలుగా తయారు చేయిoచి విక్రయిస్తారు .ఇటువంటి అబరణాలను భక్తులు ధరించవచ్చు

మన ధర్మశాస్త్రం  ఈ సందర్భంలో ఏమి చెపుతుంది


1.దేవునికి సమర్పించిన అబరణాలను భక్తులు ఎన్నడు ధరించకుడదు

2.దేవాలయం వారు దేవుని విగ్రహాన్ని విక్రయిస్తే దానిని కొన్నవారు శుద్దిచేసి అనంతరం ప్రతి రోజు దేవుని పూజను చేయవలసి ఉంటుంది

3.దేవాలయం దేవుని విగ్రహాలకు ఎట్టి పరిస్టితుల్లో ఇతరులకు ఇచ్చి పూజలు చేయిoచకూడదు

4.మీరు ఆయా క్షేత్రాల్లో విగ్రహాలను దర్శించే సమయంలో సత్యవంతులుగా ఉండాలి .దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలి .ప్రతి రోజు పూజలు చేస్తూ ఉండాలి .తమ ధర్మంలో తాము ఉండాలి

5.దేవాలయం విగ్రహాలను మంచి పాత్ర చూసి తాంభులంలో ఉంచి ప్రాయశ్చిత సంకల్పాన్ని చెప్పుకొని ఒక రోజుకు సరిపోయే పూజ సామగ్రని దానితో పాటే ఉంచి విగ్రహంతో పాటు దానం చేయవలసి ఉంటుంది

6 పూజలను చేయని వ్యక్తికి ఎటువంటి విగ్రహాన్ని ఇవ్వకూడదు .ఒకవేళ దేవుని పూజలను చేయని వారికీ ఇస్తే దైవద్రోహం చేసిన దోషాలు ఇచ్చిన వారికీ వస్తాయి

7.దేవాలయం వారు దేవుని ఆభరణాలను కరిగించే ముందుగా ప్రాయచ్శిత సుక్తాన్ని చెప్పి అనంతరం కరిగిస్తే చాల మంచి జరుగుతుంది .లేదంటే దేవుని ఆభరణాలను అపహరించిన దోషం కలుగుతుంది

8.దేవుని ఆభరణాలను ఎటువంటి పరిస్టితుల్లో దొంగలించకూడదు .లేదా కరిగించకుడదు .ఒకవేళ ఈ తరహా పనులుకు పాల్పడితే అటువంటి వారు దైవద్రోహం చేసినట్లు అవుతుంది .వారు నిత్య దరిద్రులుగా  అనారోగ్య్యం ఎప్పటికి నయంకాని  వ్యాధులతో భాదలు అనుభవించి నరకాన్ని చేరుతారు

9.స్త్రీ అబరణాన్ని మరియు పిల్లల అబరణాలను కరిగించకూడదు .ఒక వేళా అలా చేస్తే ఇంట్లో అకాల మరణాలు ఎక్కువ అవుతాయి మరియు వంశపారంపర్య్యంగా స్త్రీ శాపాలకు గురిఅవుతారు

10.అబరణాలను కరిగించేవారు  ప్రతి రోజు కులదేవతలకు పూజలు చేసి ప్రాయశ్చిత సుక్త్తాన్ని చెప్పి శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి ప్రాద్దన చేసి హిరణ్న్య సుక్త్తాన్ని చెప్పి తమకు సాధ్యమైనంత మేర దక్షిణతో ప్రతి రోజు తాoబులన్ని దానం చేసుకొంటూ వస్తే దైవదోషం తగ్గిపోతుంది

11.దేవాలయంలో విక్రయిoచే ఎ అబరణాన్ని అయినా ధరిస్తే నానాటికి దరిద్రులుగా మరి రోగాలకు గురై దైవశాపాలకు గురి కావలసి వస్తుంది

12.దేవాలయంలో అన్ని ఆస్తులు దేవునికి చెందుతాయి .భక్తులకు దేవాలయంలో తీర్ధం ,ప్రసాదంలో మినహా మరే ఇతరాలఫై హక్కులు ఉండవు

13.దేవునికి ఎన్ని అబరణాలను తయారు చేయిoఛి ఇస్తారో అంతే త్వరగా మీ అన్ని సమస్యలు ,రోగాలు తొలగిపోయి

దైవ అనుగ్రహంతో శ్రీ మంతులుగా విలసిల్లుతారు

    అబరణాలను దేవునికి సమర్పించి ధరిస్తే ఎటువంటి ఫలితం లబిస్తుంది

 ఇళ్ళలో కొత్తగా వస్తువులను తీసుకువచ్చిన లేదా కొత్తగా వస్తువులను ఆభరణాలను తీసుకొంటే వాటిని ధరిoచే ముందుగా పసుపు ,కుంకుమతో పూజించి అనంతరం దేవునికి నమస్కరం పెట్టి ధరిస్తారు .ఇది సరైన విధానం

 ఏదైనా అబారణలను తీసుకువస్తే ఏమి చేయాలి  ?


1.ఏదైనా అబరణాలను ఇంటికి తీసుకువచ్చి నేలఫై ఉంచకూడదు .దీని ద్వార యోగానికి  బంగం కలుగుతుంది

2.ఆభరణాలను కొత్తగా తయారు చేయిస్తే లేదా కొనుగోలు చేస్తే దానిని సాధ్యమైనంత మేర వెండి పళ్ళెంలో ఉంచి పసుపు ,కుకుమ ,పూలతో పూజించి అనంతరం దేవుని ముందు ఉంచి నమస్కరించాలి .కులదైవం ,ఆరాధ్య దేవుని ఇష్తార్ధం సుమంగళిలకు దానం ఇవ్వాలి .దేనితో శ్రేయస్సు మరియు కీర్తి లబిస్తుంది

3.దేవుని ఉంగరం ధరించే సమయంలో చిత్రంలో తల భాగం ఫైకి రావాలి .ఎటువంటి పరిస్తితిల్లో తల భాగం కిందకు రాకుండా చూసుకోవాలి

4.మనుషులు ధరించిన అభారణలను దేవునికి సమర్పించకుడదు

5.ఇతరుల ఆభరణాలను ధరించకుడదు

6.ఇతరుల వస్త్రాలను ధరించకుడదు .దేవునికి అర్పించకుడదు

7.దొంగలించిన ఆభరణాలను దేవునికి అర్పించకుడదు

8.మృతదేహంఫై తెసిన అభారణలను దేవునికి సమర్పించకూడదు

9.కష్టకాలంలో తాకట్టు పెట్టిన నగలను తిరిగి సొంతం చేసుకున్న వాటిని ఎట్టి పరిస్టితుల్లో దేవునికి అర్పించకుడదు

10.మనవి కాని ఆభరణాలను దేవునికి అర్పించకుడదు

11.దారిలో లబించిన అభారణలను దేవునికి సమర్పించకుడదు

12.దేవునిక్ సమర్పించే అభారణలు అందంగా చూసేoదుకు లక్షణంగా ఉండాలి

13అభారణలు  సొంతవై ఉండాలి .స్వీయర్జ్జితంతో ,కష్టపడి సంపాదించిన నగదుతో చేయిoచలి

14.ఆభరణాలను శుక్ల పక్షంలో విదియ ,తదియ ,పంచమి ,సప్తమి ,దశమి ,త్రయోదశి సోమవారం ,బుదవారం ,గురువారం ,శుక్రవారం పూజకు చాల మంచిది

15.అబరణాలను ఉదయం లేదా సాయంకాలం పూజ చేసి ధరించవచ్చు

అబరణాలను ఎప్పుడు ధరిస్తే మంచిది

1.ఆదివారం నూతన అబారణలను  ధరిస్తే  రోగబయం కలుగుతుంది

2.సోమవారం నూతన అబరణాలను ధరిస్తే మనస్సుకు ప్రశాంతత లబిస్తుంది

3.మంగళవారం నూతన అబరణాలను ధరిస్తే ఇంట్లో గొడవలు ,రోగభాద కలుగుతుంది

4.బుధవారం నూతన అబరణాలను ధరిస్తే అష్టఐశ్వార్యాలు సిద్దిస్తాయి

5.గురువారం నూతన అబరణాలను ధరిస్తే దేవత కార్యాలు ఎక్కువగా జరుగుతాయి గురువు అనుగ్రహం ఉంటుంది

6.శుక్రవారం నూతన అబరణాలను ధరిస్తే దేవతా కార్యాలు ఎక్కువగా జరుగుతాయి .శుభ కార్యాలు ఎక్కువగా జరుగుతాయి

7.శనివారం నూతన అబారణలను ధరిస్తే అబారణలు చోరికి గురిఅవుతాయి .తాకట్టు పెట్టవలసి వస్తుంది .నిత్య దరిద్రం ,రోగ భాదతో ఇబ్బందులు పడవలసి ఉంటుంది .ఎవరికైనా అబారణలు ఇస్తే తిరిగి రావు

   అందుకని అబరణాలను చేయిoచేవారు .కొనుగోలు చేసివారు .శుభదినం ,శుక్రవారం రోజు దేవునికి సమర్పించి పూజను చేసి లేదా చేయిoఛి అనంతరం ధరించితే చాల మంచి జరుగుతుంది

శాస్త్ర భద్దంగా అబరణాలను ధరించడం ఇంట్లో అబరణాలను కొనుగోలు చేసే సమయంలో లేదా చేయిoచే సమయంలో ఇంటి దేవుని ఎదుట శుభ దినం ,శుభ వారం ,శుభ కాలాల్లో పూజలు చేయిoఛి దరించవలసి ఉంటుంది .దీనితో పాటే సుమంగళిలకు తాంబూలం దానం చేస్తే వారింట శాంతి ,ప్రశాంతత ,దైవఅనుగ్రహం ఎప్పటికి ఉంటుంది

అబరణాలను దేవునికి సమర్పించి ధరించటం ద్వార దేనికి అబారణ ప్రసాదమని పేర్కొంటారు


No comments:

Post a Comment