పర్ణ ప్రసాదం                                         పర్ణం అంటే ఆకులు అని అర్ధం .మీకు ఆశ్చర్య్యం కలుగువచ్చు .కానీ పర్ణ ప్రసాదాలు ఉన్నాయి

    తిరుమల దేవాలయం నుంచి పాపవినాశాని ఆకాశగంగకు వెళ్ళే మార్గంలో పరమ భక్త హధీరం భావాజీ సమాధి ఉంది .దేన్నీ హధీరం మట్టం అని అంటారు

  ఈ దేవలాయానికి వచ్చే భక్తులకు ప్రసాదాన్ని అందిస్తారు .ప్రసాదాన్ని ఆకురుపంలో ఇస్తారు .ఆకు అంటే సామాన్య మైన ఆకు అని అనుకోవద్దు .ఈ ఆకు సామాన్యమైనది కాదు .ఆ ఆకు సంజేవాని చెట్టుది (సంజేవాని  ఆకు )

    ఈ సంజీవని ఆకుని తింటె దేహంలోని అన్ని రోగాలు నాశనం అవుతాయి .వీటిలో రెండు ఆకులు ఉన్నాయి

            1.సంజీవిని

            2. అమృత సంజీవని

     సంజీవిని చెట్టు పేరు నింటి మనకు రామాయణంలోని యుద్దకాండ ప్రకరనంలో హనుమంతుడు సంజీవిని అనే పర్వతాన్ని తెసుకువచ్చి లక్ష్మనుడిని బతికిoచిన వైనం గుర్తుకు వస్తుంది

   ఈ సంజీవిని చెట్టు ఆకులను తిని హాధిరo మహరాజు (బావాజీ )జీవితం పూర్తిగా ఆరోగ్య్యంగా ఉన్నందున ఈక్షేత్రానికి వచ్చే భక్కులు ఆరోగ్య్యంగా ఉండాలన్న ఉద్దేశ్సంతో ప్రతి ఒక్కరికి సంజీవని ఆకును ఇస్తారు .అందుకే ఈ ప్రసాదాన్ని పర్ణ ప్రసాదామని పేరు

  ఈ సంజీవని ఆకును ఎవరు తింటారో వారి రోగాలన్నీ తొలగిపోతాయి

సంజీవని ఆకును ,అమృత సంజీవని ఆకుకు ఉన్న తేడా ఏమిటి ??


   సంజీవని ఆకులాగే అమృత సంజీవని ఆకు కూడా ఉంటుంది .అమృత సంజీవని ఆకును నోటిలో ఉంచుకొని పిల్చుకొంటే నోట్లో నీటి అంశం ఎక్కువ ఉంటుంది .ఈ నీరు అమృత సమానమని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పుతారు


    అమృత సంజీవని ఆకును ఒక గుప్పిట అంత నీటితో శుబ్రపరిచి ప్రతి రోజు ఉదయం 6 గంటల్లోపు తింటే అసాధ్యం అనుకొన్న రోగాలైన కాన్సర్ ,గుండె నొప్పులు ,ఆస్తమా ,మధుమేహం తదితర వ్యాధులు నయం అయిన ఘటనలు చాల ఉన్నాయి .ఈ చెట్టు బెంగళూర్ లోని లాల్ బాగ్ ,కబ్బన్ పార్క్ మల్లేశ్వరంలోని అటవీ విబాగం నర్సరిలో లబిస్తుంది .పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు .తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు .అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు .దేనికి కూడా పర్ణ ప్రసాద మనే పేరు .

   ఆంజనేయస్వామికి మాల రూపంలో  తమలపాకులను ఎందుకు వేస్తారు


 1.స్వామికి లేత తమల పాకుల హారాన్ని వేస్తె  రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికీ త్వరగా గుణం కనిపిస్తుంది

2.ఇంట్లో మంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె మంత్ర సంభందమైన  పీడలు తొలగిపోతాయి

3.సంసారంలో ప్రశాంతత  లేని వారు స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లబిస్తుంది

4.కొందరు చిన్న పిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు .చాల నీరసంగా ఉంటారు అటువంటి సమయంలో స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె పిల్లల ఆరోగ్యం భాగుపడి వారు బాగా ఎదుగుతారు

5.వ్యాపారం చేసి సమయంలో చాల నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు ,పండ్లు దక్షిణ సమేతంగా ,దానం చేస్తే వ్యాపారం భాగుపడుతుంది

6.ఎ వ్యక్తి అయితే హీనంగా చుడభాడుతాడో అటువంటి వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంఘంలో గౌరవనీయ వ్యక్తిగా మారుతారు

7.శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె శనిశ్వరుని అనుగ్రహం కలుగుతుంది

8.వైద్య పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ,ప్రసాదాన్ని తింటూ వుంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి

9.సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె అన్ని కార్యాలలో విజయం సిదిస్తుంది

10.హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రాద్దించి తమలపాకుల హారాన్ని వేస్తె పరమాత్మని అనుగ్రహం ఉంటుంది

11.వాద వివాదాల్లో స్వామిని ప్రాద్దించి తమలపాకుల హర ప్రసాదాన్ని తెంటే జయం మీది అవుతుంది

12.తాoబులా దానంతో గంగా దేవి సంతృప్తి పడుతుంది .No comments:

Post a comment